ఇశ్రాయేలీయులు యుద్ధం జేస్తున్న ప్రతీసారీ, ఇదిగో బైబిలు ఇలా చెప్పింది అలా చెప్పింది, ప్రవచనాలు నెరవేరిపోతున్నాయి, 3వ మందిరం కట్టబడుతుంది, యూదులు చాలా గొప్పోళ్ళు తెలివైనోళ్ళు వాళ్ళు ఎన్నో కనిపెట్టేరు యేసు వచ్చేస్తున్నాడు ఇలా ఎన్నో రకరకాల మెసేజెస్ తో సోషల్ మీడియా అంతా నింపుతూ వ్యూస్ కోసం వాళ్ళ వీడియోలు ట్రెండింగ్ లో ఉండడం కోసం బోధకులు అందరూ వాక్యం, బైబిలు ప్రక్కన పెట్టేసి sudden గా News Reporter అవతారం లోకి మారిపోతూ ఉంటారు.
అయితే ఒక క్రైస్తవుడుగా నాదొక చిన్న ప్రశ్న – "యూదులు తెలివైనవాళ్లు అంటే, వారు మెస్సీయను కనుగొన్నారా?" జవాబు – లేదు. వారు ఇంకా మెస్సీయ రానున్నాడని ఎదురుచూస్తున్నారు. కానీ యోహాను 1:41 ప్రకారం, "మేము మెస్సీయను కనుగొంటిమని" మొదటి శతాబ్ద యూదులు ప్రకటించారు.
ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సీయను కనుగొంటి మని యోహాను 1:41
అంటే, కొందరు యూదులు నిజంగా యేసే మెస్సీయని అంగీకరించారు. కానీ అధికశాతం యూదులు (ఇప్పటికీ చాలా మంది) మెస్సీయ ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నారు.
3ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరుఅని యెషయా చెప్పినట్లు సరిగ్గా సరిపోతారు కదా!
తెలివి అంటే ఏమిటి? ఎవరిది అసలు తెలివి?
ప్రపంచానికి గొప్ప ఆవిష్కరణలు ఇచ్చినవారు చాలామంది యూదులు కావచ్చు. కానీ దేవుని దృష్టిలో తెలివి ఏమిటో బైబిల్ స్పష్టంగా చెబుతోంది:
ఈ లోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు – (1 కోరింథీయులకు 1:20-21)
మెస్సీయ వారి మధ్యకు వచ్చి పునరుద్ధానుడు అయి పరలోకానికి ఆరోహణుడై మళ్లీ రెండవసారి రాబోతున్న కాలంలో ఉండి _ ఇంకా మెస్సీయ వస్తాడు అని ఎదురు చూస్తున్న యూదుల తెలివిని ఈ ప్రపంచం కొనియాడవచ్చును గాని బైబిలు వీరిని "వెర్రివాళ్ళు" అంటుంది.
ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసియున్నాడు గదా? ఎందుకంటే దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని యొరిగి యునడలేదు. అంత మాత్రమే కాదు. [24] ఆయన యూదులకు ఆటంకము గాను అన్యజనులకు వెఱ్ఱితనముగాను ఉన్నాడు; గాని యూదులకేమి, గ్రీసుదేశస్థులకేమి, పిలువబడినవారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు.
బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి. కొలొస్సయులకు 2:3
ఆవిష్కరణలు – ఏ జాతికైనా చెందే గొప్పతనం:
మన చరిత్ర చూస్తే, ప్రపంచాన్ని మార్చిన ఆవిష్కరణలు అన్ని జాతుల నుండీ వచ్చాయి. కొన్ని ఉదాహరణలు:
విమానం – Wright Brothers (USA)
బల్బు – Thomas Edison (USA)
కంప్యూటర్ – Charles Babbage, Alan Turing (England)
ఇంటర్నెట్ – Tim Berners-Lee (England)
ముద్రణ యంత్రం – Johannes Gutenberg (Germany)
టెలిఫోన్ – Alexander Graham Bell (Scotland)
వ్యాక్సిన్ – Edward Jenner (England)
ఇవి ఎవరి "DNA" వల్ల కాదు. ఎందుకంటే మనం అందరం ఒకే ఆదామునుంచి సృష్టించబడ్డ వారమే:
ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించెను – (అపో. కార్యములు 17:26)
అందువల్ల, తెలివితేటలు దేవుని అనుగ్రహం. ఒక జాతిని మాత్రమే ఎక్కువ చేసి మాట్లాడటం అనేది బైబిలు సిద్ధాంతానికి విరుద్ధం.
5. దేవునికంటె వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు.మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు. 6. నీ చేతిపనుల మీద వానికి అధికారమిచ్చి యున్నావు. 7. గొఱ్ఱెలన్నిటిని, ఎడ్లనన్నిటిని అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్య ములను. 8. సముద్ర మార్గములలో సంచరించువాటి నన్నిటిని వాని పాదములక్రింద నీవు ఉంచి యున్నావు. కీర్తనలు 8:5-8
దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఆదికాండము 1:28
అంటే అన్ని జాతులు లోను ఈ Inventions ను చూడగలము అని దృష్టిలో పెట్టుకోవాలి. లేదంటే దేవుని మనం పక్షపాతిని చేసినవారమవుతాము సుమా!
హిట్లర్ హింస – సువార్త కోసమా? రాజకీయమా?
అవును, యూదులు చంపబడ్డారు. కాని ఎందుకంటే వారు క్రీస్తును బోధించినందుకా? కాదు. అది హిట్లర్ యొక్క రాజకీయ పాశవికత, జాతి ద్వేషానికి ఫలితం. ఎందుకంటే హిట్లర్ యూదులను జర్మనీ సమస్యలకు కారణమని నమ్మి, వారిని నిర్మూలించాలనుకున్నాడు. అది Political Genocide, not Gospel Martyrdom.
ఇజ్రాయేలు ఓడరాని దేశమా?
ఇజ్రాయేలు దేవుని ప్రజలు అనుకుంటూ, వారిని ఎవ్వరూ తాకలేరని కొందరు చెబుతున్నారు. కాని నేటి యుద్ధాలు దేవుని ఆజ్ఞ ప్రకారమా? కాదు. ఇవి రాజకీయం, భద్రతా చర్యలు. పాత నిబంధన కాలంలో దేవుడు వారిని ఓడిపోవడానికి కూడా అనుమతించాడు. కాబట్టి నేటి యుద్ధాలను దేవుని సంకల్పంతో కలపడం సత్యానికి విరుద్ధం. ఇది వారి regional and political war. ఇంకా చెప్పాలంటే అక్కడి పార్లిమెంట్ సభ్యులుదీనిని నేతాన్యుహు private war అని కూడా పిలుస్తున్నారు. ఎవరి వద్ద అయినా Defense Resources Unlimited ఉండవు. వారి Arrow system weak అయింది అంటే వారు కష్టాల్లో పడతారు. US support లేకుండా వారు ఎక్కువ కాలం యుద్ధం చేయలేరు. ఎన్నో సార్లు పాతనిబంధన కాలంలో దేవుడే ఇశ్రాయేలీయులను శత్రువుల చేతికి అప్పగించిన సందర్భాలు ఉన్నాయి.
యుద్ధాలు దేనినుండి కలుగుచున్నాయి?
యాకోబు ప్రపంచం అంత చేదిరియున్న యూదులను ఉద్దేశించి మాట్లాడుతూ, యుద్ధాలకు మూల కారణం చెబుతున్నాడు.
1మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా? 2మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్యచేయుదురు మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు; పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీ కేమియు దొరకదు. 3మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు. యాకోబు 4:1-3
క్రీస్తు రాజ్యం - శాంతి రాజ్యం:
ఐతే ఇపుడు క్రీస్తు కాలంలో ఉన్నాం. ఈయన సర్వాధికారంలో ఉన్నాం. క్రీస్తు రాజ్యాంగం వేరు క్రీస్తు రాజ్యం వేరు కదా! ఈయన రాజ్యమంటే ప్రేమ శాంతి సమాధానం. క్రైస్తవులు ఆరిననేల కనిపించిన ప్రతీ చోట విస్తరించి యున్నారు. ఇరాన్ లో ఉనారు ఇజ్రాయిల్ లో ఉన్నారు అమెరికా లో ఉన్నారు. ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు అంటూ వస్తే అది ఎవరికీ మంచిది కాదు. ఎవరూ హర్షించవలసినది కానేకాదు.
ఐతే దేవుడు కోరుకున్నది ఒకటే _ యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచున్నాడు.
కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు. 2 పేతురు 3:9
యేసునందు అందరూ సమానులు:
మొత్తానికి, యేసు క్రీస్తునందు జాతి, లింగం, కులం అనే బేధాలు లేవు. విశ్వాసములో క్రీస్తుని అంగీకరించిన ప్రతివాడూ దేవుని కుమారుడే, అబ్రహాము సంతానమే! వాగ్దాన వారసుడే!
28. ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.
29 మీరు క్రీస్తు సంబంధులైతే (క్రైస్తవులు) ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు. గలతియులకు 3:28-29
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి