About Blog

This blog presents you astounding information of various aspects of Christian theology which explores the Bible to meet modern science and bring it bow down in front of it. It proves in all posts the Bible is ONLY the word of God by bringing its unique universal truths and facts about future of the world which could not be gazed by anybody on the face of the earth. It also notifies Christian apologetics and brings to you deceptions that are widely believed by many a Christians. All in all, this is simple & informative Guide to the people of the fast-paced world of today that finds most of us scrambling to meet deadlines, handling perplexing decisions and confronting crisis and situations every single day.

Happy Reading!!



23, జూన్ 2025, సోమవారం

యోహాను 1:1 ప్రకారము యేసు ఎవరు?

"దియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను." యోహాను 1: 1
          "Ἐν ἀρχῇ ἦν ὁ λόγος, καὶ ὁ λόγος ἦν πρὸς τὸν θεόν, καὶ θεὸς ἦν ὁ λόγος" 

In the beginning was the Word, and the Word was with God, and the Word was God.

అను వాక్యాన్ని వ్యతిరేకించే కొందరు అనగా యేసు దేవుడు కాదు అని చెప్పే యూద జాతికి  చెందిన కొందరు తెలుగు పండితులు దీనిని ఈ క్రింది విధంగా  చదువుకోవాలాని విచిత్రమైన వక్రీకరణ చేస్తున్నారు.

ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవునిదై  లేదా దేవత్వముగలదై యుండెను.

కాబట్టి బైబిలలో యేసు దేవుడు అని ఎక్కడెక్కడ ఉందో చూసి దానిని సవరించి లేదా తీసివేయాలనేది వీరి పాండిత్య  సారాంశం. ఎందుకంటే అవి వారు  తయారు చేసుకొన్న సిద్దాంతాలకు ఇవి అడ్డుబండలుగా ఉండి అతకడం లేదు కాబట్టి.  This is like putting the cart before the horse.  నిజానికి అర్ధం కాని ప్రశ్నలకు సమాధానాలు బైబిలులో వేదకాలి. బైబిలే చెప్పాలి గాని  మానవ మాత్రులు కాదు. అలా చెబితే అది తమాషాగా ఉంటుంది, వాక్యం నిరర్ధకం అవుతుంది. అది ఎలాగో వీరు  చెప్పిన "కలిపి  చెరిపెడు" వాక్యం బట్టే అర్దం అవుతుంది .. 

"వాక్యము దేవునిదై యుండెను" గా కలిపి చెరిపిన పండితులకి, తరువాత వాక్యాలు కూడా మార్చుకోవాలి అని తెలియలేదు అనుకొంటాను...లేదా వారిని వెంబడించిన శిష్యబృందానికి  అంత భాషా పరిజ్ఞానము ఉండి ఉండక పోవచ్చును. 

మిగిలిన వాక్యాలను కూడా గమనిద్దాం. 

3. కలిగియున్నదేదియు ఆయన (He) లేకుండ కలుగలేదు.
4. ఆయనలో (Him) జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.
10. ఆయన (He) లోకములో ఉండెను, లోక మాయన  (Him)మూలముగా కలిగెను గాని లోకమాయనను  (Him)తెలిసికొనలేదు.
11. ఆయన (He) తన స్వకీ యులయొద్దకు వచ్చెను; ఆయన (He)స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు

ఇక్కడ "ఆయన" అంటే 1:1 లో వాక్యము ఎవరో చెప్పాలి? దేవుడై యుండెన (He)  లేక  దేవునిదై యుండెన? (It)

The pronoun “He” or "Him" refers to a masculine noun.

కొంతసేపు వీరి కోసం లేదు లేదు అక్కడ కచ్చితంగా "వాక్యము దేవునిదై  లేదా  దేవత్వముగలదై యుండెను" అనే అనుకొందాం, అపుడు పై వచనాలు ఇలా మారాలి మరి.  

3. కలిగియున్నదేదియు అది (It) లేకుండ కలుగలేదు.

4. దానిలో  (It) జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను.

10. అది (It) లోకములో ఉండెను, లోకము  దాని (It)మూలముగా కలిగెను గాని లోకము దానిని   (It)తెలిసికొనలేదు.

11. అది (It) తన స్వకీయులయొద్దకు వచ్చెను; దాని (It)స్వకీయులు దానిని అంగీకరింపలేదు. 

The pronoun “It” refers to a gender-neutral.

ఇలా చదువుకుంటే విచిత్రంగాను అర్ధరహితంగాను  ఉంది కదూ! మొదటి ఆద్యాయం అంతా అర్ధరహితం అయిపోతుంది! 

వాక్యము దేవుడై యుండెను అని ముగించినపుడే, తరువాత వాక్యాల్లో "ఆయన (He)" అని చెబుతారు. ఇది భాషాభాగాల్లో ఉన్న ఒక ప్రాధమిక వ్యాకరణ నియమము. దేవునిదై యుండెను అంటే ఆ వాక్యాలకు అర్ధం లేదు. అది తెలియక ఒక పదం మార్చేసి మేమేదో correction చేసేసాము అనుకొంటున్నారు. కాబట్టి వీరి  సిద్దాంతం కోసం ఆ అద్యాయంలో మిగిలిన 50 వచనాలు బైబిలులో నుండి తీసేయాలి. మరో మార్గం లేదు మరి. 

చివరిగా వివాదము ఏమీ లేకుండా (Without controversy) ప్రశాంతంగా ఆలోచిద్దాం!

"ఆ (దేవుడైయున్న)  వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను" - యోహాను 1:14

అని చెప్పిన యోహాను మాటను  పౌలు ఒక్క మాటలో చక్కగా చాలా  సూటిగ  చెప్పడం గమనించగలం. 

నిరా క్షేపముగా(Without controversy) దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. 1 తిమోతికి 3: 16

And without controversy great is the mystery of godliness: God was manifested in the flesh (Jesus' incarnation)

"The truth that Jesus is God comes straight from the horse’s mouth — the Word of God itself." 

అటు యోహాను ఇటు పౌలు రచనలలో యేసు దేవుడు అని చాలా  స్పష్టంగా నిరాక్షేపముగా చెప్పవచ్చును. "దేవునిదై" లేదా "దేవత్వముగలదై" అనే అనువాద మార్పులు, నిజంగా లేఖనపరంగా  (scripturally) మరియు భాషాపరంగా  (linguistically) బలహీనంగా ఉన్నాయని   చాలా  స్పష్టంగా చెప్పవచ్చును . 

ఆలోచించండి, పరిశీలించండి, వాక్యాన్ని గౌరవించండి. మన సిద్ధాంతాలను గ్రంథానికి లోబరుచుకుందాం, గమనించి మార్చుకుందాం.

Think, reflect, and honor the Scripture. Let the Word shape our doctrine — not the other way around.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి