How to Study the Bible (Part-1)
Hermeneutics (హెర్మెనిటిక్స్)
ముఖ్య అంశము (Main Topic): బైబిలు ఎలా చదవాలి?
లేదా బైబిలును ఎలా అర్ధం చేసుకోవాలి?
పరిచయ భాగము (Sub-topic): బైబిలును ఎందుకు
చదవాలి?
ముఖ్య అంశమును ఆలోచించుటకును దాని యొక్క ప్రాధాన్యతను గ్రహించి, విలువను గుర్తించుట కొరకు పరిచయ భాగమును పరిశీలించూదాం.
బైబిలును ఏవిధముగా అభ్యాసము చేయవలెనో గ్రంధంలోని ముగ్గురు మహా జ్ఞానులు చెప్పిన
మాటలను, సూచనలను ఒకసారి గమనిద్దాం.
1. యేసుక్రీస్తు - "చదవాలి మరియు పరిశోధించాలి"
అని చెప్పారు.
ఈయన మత్తయి లో 4 సార్లు, మార్కు లో ౩ సార్లు = 7 సార్లు
"మీరు చదువలేదా?" అని అడగడం గమనిస్తాము మరియు
యోహాను లో "లేఖనములను పరిశోధించుడి" అని చెప్పడం మనం చూస్తాం.
యోహాను 5: 39.
లేఖన ములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు (పరిశోధించుడి), అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చు చున్నవి
మత్తయి 12:5, 19:5, 21:16, 22:31
మార్కు 2:25, 12:11, 12:26
2. సొలొమోను - "సత్యమును పరిశీలన చేయవలయును"
అని అంటున్నాడు.
ప్రసంగి 7: 24.
సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు?అని అడుగుతున్నాడు. ఇక్కడ ఈయన సత్యమును పరిశీలన చేయమంటున్నాడు.
౩. పౌలు – “చదివినయెడల
గ్రహించుకొనగలరు.” అని చదవడం యొక్క ప్రాధాన్యత ను గురించి తెలియజేస్తున్నాడు
నూతన నిబంధన 27 పుస్తకాలలో అత్యధిక పత్రికలు అంటే 14 పుస్తకాలు
వ్రాసిన (>50%) రచయిత చెబుతున్న మాటలు -
ఎఫెసీయులకు 3:4
మీరు దానిని చదివినయెడల దానినిబట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొన గలరు.
బైబిలును చదువునపుడు సులభంగా అర్ధం జేసుకొనుట కొరకు మూడు
భాగములుగా విభజించుకొందాం.
ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.
1. ధర్మశాస్త్రం:
దేవుడు మోషే ద్వారా అనుగ్రహించడం జరిగింది. దీనిని ధర్మశాస్త్ర
కాలం అందాం
2. సత్యం: యేసుక్రీస్తు ద్వారా కలిగెను కాబట్టి యేసుక్రీస్తు
కాలం అందాం
౩. సర్వ సత్యం:
పరిశుద్దాత్మ ద్వారా నడిపించబడటం జరిగింది కాబట్టి అపొస్తలుల కాలం అందాం
యోహాను 16: 13.
అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును
ముగింపు మాటలు: బైబిలు చదవకుండ నిర్లక్ష్యము చేసినయోడల మన ఆత్మీయ జీవితమునకు , రక్షణలో ఎదుగుదలకు (1 పేతురు 2:3 ) , నిత్యజీవము పొందుకొనుటకు మనకు మనమే ఆటంకము కలుగజేసుకొన్న వారమవుతాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి