About Blog

This blog presents you astounding information of various aspects of Christian theology which explores the Bible to meet modern science and bring it bow down in front of it. It proves in all posts the Bible is ONLY the word of God by bringing its unique universal truths and facts about future of the world which could not be gazed by anybody on the face of the earth. It also notifies Christian apologetics and brings to you deceptions that are widely believed by many a Christians. All in all, this is simple & informative Guide to the people of the fast-paced world of today that finds most of us scrambling to meet deadlines, handling perplexing decisions and confronting crisis and situations every single day.

Happy Reading!!



6, ఆగస్టు 2024, మంగళవారం

How to Study the Bible (Hermeneutics)

 

How to Study the Bible (Part-1)

Hermeneutics (హెర్మెనిటిక్స్)


 

ముఖ్య అంశము (Main Topic): బైబిలు ఎలా చదవాలి? లేదా బైబిలును ఎలా అర్ధం చేసుకోవాలి?

పరిచయ భాగము (Sub-topic): బైబిలును ఎందుకు చదవాలి?

ముఖ్య అంశమును ఆలోచించుటకును దాని యొక్క ప్రాధాన్యతను గ్రహించి, విలువను  గుర్తించుట కొరకు పరిచయ భాగమును పరిశీలించూదాం. బైబిలును ఏవిధముగా అభ్యాసము చేయవలెనో గ్రంధంలోని ముగ్గురు మహా జ్ఞానులు చెప్పిన మాటలను, సూచనలను ఒకసారి గమనిద్దాం.

1. యేసుక్రీస్తు - "చదవాలి మరియు పరిశోధించాలి" అని చెప్పారు.

ఈయన మత్తయి లో 4 సార్లు, మార్కు లో ౩ సార్లు = 7 సార్లు "మీరు చదువలేదా?" అని అడగడం గమనిస్తాము మరియు యోహాను లో "లేఖనములను పరిశోధించుడి" అని చెప్పడం మనం చూస్తాం.

యోహాను 5: 39. 

లేఖన ములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు (పరిశోధించుడి), అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చు చున్నవి

 మత్తయి 12:5, 19:5, 21:16, 22:31

మార్కు 2:25, 12:11, 12:26

2. సొలొమోను - "సత్యమును పరిశీలన చేయవలయును" అని అంటున్నాడు.

ప్రసంగి 7: 24. 

సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు?
 అని అడుగుతున్నాడు. ఇక్కడ ఈయన సత్యమును పరిశీలన చేయమంటున్నాడు.

౩. పౌలు చదివినయెడల గ్రహించుకొనగలరు.” అని చదవడం యొక్క ప్రాధాన్యత ను గురించి తెలియజేస్తున్నాడు

నూతన నిబంధన 27 పుస్తకాలలో అత్యధిక పత్రికలు అంటే 14 పుస్తకాలు వ్రాసిన (>50%) రచయిత చెబుతున్న మాటలు -

ఎఫెసీయులకు 3:4 

మీరు దానిని చదివినయెడల దానినిబట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొన గలరు.

బైబిలును చదువునపుడు సులభంగా అర్ధం జేసుకొనుట కొరకు మూడు భాగములుగా విభజించుకొందాం.

 యోహాను 1: 17 

ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.

1. ధర్మశాస్త్రం:

దేవుడు మోషే ద్వారా అనుగ్రహించడం జరిగింది. దీనిని ధర్మశాస్త్ర కాలం అందాం

2. సత్యం: యేసుక్రీస్తు ద్వారా కలిగెను కాబట్టి యేసుక్రీస్తు కాలం అందాం

౩. సర్వ సత్యం:  పరిశుద్దాత్మ ద్వారా నడిపించబడటం జరిగింది కాబట్టి అపొస్తలుల కాలం అందాం

యోహాను 16: 13. 

అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును

 

ముగింపు మాటలు: బైబిలు చదవకుండ నిర్లక్ష్యము చేసినయోడల మన ఆత్మీయ జీవితమునకు , రక్షణలో ఎదుగుదలకు (1 పేతురు 2:3 ) , నిత్యజీవము పొందుకొనుటకు  మనకు మనమే ఆటంకము కలుగజేసుకొన్న వారమవుతాము.

4, ఆగస్టు 2024, ఆదివారం

How to read the Bible (Hermeneutics)

How to read the Bible 
Hermeneutics (Part-2)

 ఆది12:1 

యెహోవా (అబ్రాము తో) నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము. 

అపొ. కా 4:34  

భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మిన వాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి. 

పైన కనిపించే వాక్య భాగములు ఈనాడు మనకు వర్తిస్తాయా? బైబిలులో కనిపించే ప్రతి వాక్యభాగాన్ని తీసుకొని మనకు డైరెక్ట్ గా ఎన్నడూ అనువదించుకొనకూడదు. దీని కొరకు మనము కొన్ని validations ను పరిశీలించవలయును. 

  1. Time Check: (Tenses like Past Tense, Present Tense and Future Tense)
1 పేతురు 1:11.
వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, "యే కాలమును ఎట్టి కాల మును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి."
2. Context Check: (Reading a text without knowing context makes no sense) 

         అ. కా. 8: 32-35 

32 అతడు లేఖనమందు చదువుచున్న భాగ మేదనగా- "ఆయన గొఱ్ఱవలె వధకు తేబడెను బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరవకుండెను. 33 ఆయన దీనత్వమునుబట్టి ఆయనకు న్యాయవిమర్శ దొరకకపోయెను ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమిమీదనుండి తీసివేయబడినది." 34 అప్పుడు నపుంసకుడు ప్రవక్త యెవని గూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్నుగూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు నడిగెను. 35 అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. 

  3. Grammar Check: (Grammatical sense gives more strength to clarification) 

 Every language has rules of grammar, and we must interpret the Bible according to those rules.
గలతీ 3:16
అబ్రాహామునకును అతని సంతానము నకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు. (సంతానము vs సంతానములు - Singular vs Plural) 

  4. Comparison Check: (Bible answers to the Bible)
1 కొరింథీ 2:13
మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. (Comparing spiritual things with spiritual)