నేటి రోజుల్లో సంఘాలలో వాక్యం ఎలా బోధించబడుతుంది? ఎలా మారిపోయిందో గమనిస్తున్నామా?
గడ్డం పట్టుకొని బుజ్జగించినట్లుగా…
ఆముదం పెట్టి మసాజ్ చేసినట్లుగా…
దువ్వెన పెట్టి తల దువ్వినట్టుగా...
బట్టలు ఇస్త్రీ చేసినట్టుగా…
వినేవారికి అనుకూలంగా సువార్తను మార్చేస్తున్నారు కదా! ఈ రోజుల్లో చాలా మంది ప్రసంగికులు వాక్యం చెప్పడం మానేసి కథలు చెప్పడం మొదలుపెట్టారు. నవ్వులు… జోకులు… చప్పట్లు…
సభలు హరికథా ప్రోగ్రామ్స్ లాగా, పాటల కచేరీల లాగా, లేదా Stand-up Comedy షోల లాగా మారిపోతున్నాయి. కానీ అసలైన Gospel (సువార్త) అంటే ఇదేనా?
Preaching is not a comedy night, it's bringing sinners to the light!
1. చెవులు గోకించుకునే బోధల పట్ల హెచ్చరిక (Warning Against Pleasant Messages)
ఈ రోజుల్లో చాలా మంది ప్రసంగికులకు మైక్ ఇస్తే చాలు, జనాలను ఎలా నవ్వించాలి అనే దాని మీదే దృష్టి పెడుతున్నారు. ప్రజలు కూడా తమ పాపాలను ఖండించే వాక్యం కంటే, తమను ఎంటర్టైన్ చేసే బోధలనే కోరుకుంటున్నారు. బైబిల్ దీని గురించి స్పష్టంగా హెచ్చరించింది:
2 తిమోతి 4:3–4 (2 Timothy 4:3-4): "ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొందురు."
ఇది నేటి ఎంటర్టైన్మెంట్ ప్రసంగాలకు (Entertainment preaching) ప్రత్యక్ష ఉదాహరణ.
2. నవ్విస్తే మారుమనసు రాదు (Humor Cannot Bring Repentance)
నవ్వించడం, నవ్వించడం, నవ్వించడం... ఎందుకు నవ్విస్తున్నావ్?ఎందుకు కవ్విస్తున్నావ్? ఎందుకు కథలు చెబుతున్నావ్? కానీ గుర్తుంచుకోండి, జనాలను నవ్విస్తే Repentance (మారుమనసు) రాదు. నవ్వుతూ కూర్చుంటే పాపం యొక్క తీవ్రత తేలిపోతుంది. దేవుని వాక్యం విన్నప్పుడు మనిషి తన పాపాన్ని బట్టి దుఃఖించాలి.
2 కొరింథీయులకు 7:10 (2 Corinthians 7:10): “దేవుని చిత్తప్రకారమైన దుఃఖము రక్షణకరమైన పశ్చాత్తాపమును కలుగజేయును.”
Godly sorrow → Repentance → Salvation. రక్షణ కలగాలంటే దేవుని చిత్తప్రకారమైన దుఃఖం రావాలి కానీ నవ్వులు కాదు.
Don't treat preaching like a comedy show, let the true repentance grow!
3. పరిశుద్ధాత్మ కార్యం నవ్వించడం కాదు — ఒప్పించడం (Conviction of Sin)
నిజమైన సువార్త మనుషులను సంతోషపెట్టదు, వారి పాపాన్ని ఖండిస్తుంది. పాపానికి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణ త్యాగానికి ఉన్న సంబంధాన్ని ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేటట్లు చెప్పాలి.
యోహాను 16:8 (John 16:8): “ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.” (The Holy Spirit's work is conviction, not entertainment).
హెబ్రీ 4:12 (Hebrews 4:12): “దేవుని వాక్యము సజీవమై బలముగలదై… హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” (Word of God penetrates — not entertains).
అపొస్తలుడైన పౌలు బోధించినప్పుడు విన్నవారు నవ్వలేదు, వారిలో భయం పుట్టింది.
అ.కా. 24:25 (Acts 24:25): పౌలు నీతిని గూర్చియు ఆశానిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్సు భయపడెను. (Real preaching produces fear and conviction, not laughter).
4. సువార్త ప్రసంగం ప్రజల అభినందన కోసం కాదు (Seriousness of Preaching)
ఒక సేవకుడు జనాలను మెప్పించడానికి (entertain, impress, amuse) వాక్యం చెప్పకూడదు. బైబిల్ ప్రకారం బోధ ఎలా ఉండాలి?
2 తిమోతి 4:2 (2 Timothy 4:2): “వాక్యమును ప్రకటించుము… సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దింపుము, బుద్ధి చెప్పుము.” (Rebuke, correct, exhort).
1 కొరింథీయులకు 1:18 (1 Corinthians 1:18): “సిలువనుగూర్చిన వార్త నశించుచున్నవారికి వెఱ్ఱితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.” (Gospel is powerful — not a performance).
సువార్త ప్రసంగం ప్రజల అభినందన కోసం కాదు — దేవుని సంతృప్తి కోసం.
గలతీయులకు 1:10 (Galatians 1:10): “ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్ట గోరుచున్నానా?”
5. క్రీస్తు మాదిరి: ఆయన నవ్వలేదు, ఆత్మల కొరకు ఏడ్చాడు (Christ’s Emotional Burden)
యేసుప్రభువు నవ్వినట్టు బైబిల్లో ఒక్క చోట కూడా వ్రాయబడలేదు. ఆయన ఎందుకు నవ్వలేదు? ఒకవేళ ఆయన నవ్వి, జోకులు వేసి ఉంటే... పాపం అనేది చాలా చిన్న విషయం అని ప్రజలు అనుకుంటారు. ఆయన తన Message ని ఎక్కడా డైల్యూట్ (Dilute) చేయలేదు.
ఆయన మనుషుల పాపాలను చూసి, వారి స్థితిని చూసి భారంతో ఏడ్చాడు:
యోహాను 11:35 (John 11:35): "యేసు కన్నీళ్లు విడిచెను."
లూకా 19:41 (Luke 19:41): "ఆయన పట్టణము సమీపించినప్పుడు దానిని చూచి దానివిషయమై యేడ్చి..."
మత్తయి 23:37 (Matthew 23:37): “యెరూషలేమా, యెరూషలేమా… కోడి తన పిల్లలను రెక్కలక్రింద కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును ఎన్నోమారులు నీ పిల్లలను పోగుచేయవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి.” (Shows Christ’s grieving heart for sinners).
ముగింపు (Conclusion)
సువార్త అంటే ప్రజలను రంజింపజేయడం కాదు, రక్షించడం. మన ప్రసంగాలు Entertainment కొరకు కాదు, ఆత్మల రక్షణ కొరకు ఉండాలి. సిలువలో యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని చులకన చేసేలా నవ్వుల పాలు చేయక, నిజమైన పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరుగుదాం. క్రీస్తు మాదిరిని అనుసరిద్దాం.

